బావలతో చాటింగ్ చేస్తున్నారని ఇద్దరు అక్కచెల్లెళ్లపై కర్రలు, రాళ్లతో దాడి

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది.

Arun Chilukuri
Published on: 5 July 2021 2:54 PM IST
Two Women Beaten With Sticks By Family Members in Madhya Pradesh
X

బావలతో చాటింగ్ చేస్తున్నారని ఇద్దరు అక్కచెల్లెళ్లపై కర్రలు, రాళ్లతో దాడి

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. అక్కాచెల్లెళ్లను కుటుంబ సభ్యులే చితకబాదిన ఘటన ధార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.

పీపల్వా గ్రామంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఫోన్‌లో తమ మేనమామ కుమారులతో చాటింగ్‌ చేస్తున్నారు. ఇది నచ్చని బాధితుల బాబాయి కొడుకులు ఆ ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. జుట్టు పట్టుకొని ఈడ్చి ఈడ్చి కొట్టారు. వదిలేయాలని కాళ్ల, వేళ్లా పడినా కనుకరించలేదు. అదేపనిగా అమ్మాయిలను చితక్కొట్టారు.

విషయం తెలుసుకొని, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story