Two Terrorists killed: శ్రీన‌గ‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్దరు ముష్కరులు హతం

Arun Chilukuri
Published on: 25 July 2020 12:09 PM IST
Two Terrorists killed: శ్రీన‌గ‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్దరు ముష్కరులు హతం
X

Two Terrorists killed: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా శ్రీనగర్‌ శివారులోని రణ్‌బీర్‌గఢ్‌ ప్రాంతంలో భద్రతాదళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. ర‌ణ్‌బీర్‌గ‌ఢ్‌లో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారంతో భ‌ద్ర‌త ద‌ళాలు, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు, జ‌మ్ముక‌శ్మీర్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్ పోలీసులు సంయుక్తంగా శ‌నివారం తెల్ల‌వారుజామున గాలింపు చేప‌ట్టాయి.

ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే భ‌ద్ర‌తా ద‌ళాల‌పై ఉగ్ర‌వాదులు ఒక్క‌సారిగా గుండ్ల వ‌ర్షం కురిపించార‌ని, దీంతో ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హ‌త‌మ‌య్యార‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు పేర్కొన్నారు. మ‌రో ఇద్ద‌రి నుంచి ముగ్గురు ఉగ్ర‌వాదులు ఆ ప్రాంతంలో ఉన్నార‌ని, వారికోసం గాలింపు కొన‌సాగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. క‌శ్మీర్‌లో జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 144 మంది ఉగ్ర‌వాదులను భ‌ద్ర‌తాద‌ళాలు ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ట్టుబెట్టాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story