జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఎన్‌కౌంటర్
Jammu And Kashmir: ఇద్దరు ఉగ్రవాదులు హతం, జేషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారిగా గుర్తింపు
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఎన్‌కౌంటర్
Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య అర్ధరాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారని భద్రతా బలగాలకు సమాచారం రావడంతో... స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు సోపోర్ టౌన్ లోని బొమై ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని జమ్ము డీఐజీ తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో సాధారణ పౌరుడు గాయపడ్డాడని.. అతడిని ఆస్పత్రికి తరలించామన్నారు. హతులను జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మహ్మద్ రఫి, కైసర్ ఆశ్రఫ్ గా గుర్తించామన్నారు.
Next Story




