ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అబూజ్‌మడ్‌ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 22 Sept 2025 3:03 PM IST
ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి
X

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అబూజ్‌మడ్‌ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలతో పాటు.. ఇద్దరి మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అబూజ్‌మడ్‌ అడువుల్లో ఎన్‌కౌంటర్‌ను జిల్లా ఎస్పీ కూడా ధ్రువీకరించినట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story