Punjab: పాటియాలాలో రెచ్చిపోయిన ఖలిస్తాన్ మద్దతుదారులు

Punjab: ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు

Rama Rao
Published on: 29 April 2022 3:40 PM IST
Two Groups Clash In Punjabs Patiala | Telugu News
X

Punjab: పాటియాలాలో రెచ్చిపోయిన ఖలిస్తాన్ మద్దతుదారులు

Punjab: పంజాబ్ లో ఖలిస్తాన్ సపోర్టర్లు రెచ్చిపోయారు. పాటియాలాలో రోడ్ల మీదికొచ్చి వీరంగం సృష్టించారు. ఖడ్గాలు, చరుకత్తులు చేతపట్టుకొని ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఖలిస్తాన్ ను వ్యతిరేకిస్తున్న శివసేన గ్రూపు కూడా రోడ్ల మీదికొచ్చి ప్రతినినాదాలు చేసింది. అయితే శివసేన పేరుతో ఇక్కడున్న గ్రూపు మహారాష్ట్రలోని శివసేన పార్టీతో సంబంధం లేకపోవడం విశేషం. దీంతో పాటియాలా సిటీ వీధులు ఉద్రిక్తంగా మారాయి. ఖలిస్తాన్ సపోర్టర్లు రెచ్చిపోయి ఓ పోలీస్ అధికారి చేతిని గాయపరచాడు. కత్తులు చేతపట్టుకున్నవారిని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఈ ఘటనతో పంజాబ్ లో దిగజారిపోతున్న శాంతిభద్రతల పరిస్థితులు తెరమీదికొచ్చాయి.

Rama Rao

Rama Rao

Next Story