Explosion Inside Jammu Airports: జమ్మూ ఎయిర్ పోర్టులో రెండు పేలుళ్లు

Two Explosions Rock Technical Area of Jammu Airport
x

Technical Area of Jammu Airport

Highlights

Explosion Inside Jammu Airports: జమ్మూ ఎయిర్ పోర్టులోని టెక్నికల్ ఏరియాలో పేలుళ్లు జరిగాయని ఏఎన్ఐ తెలిపింది.

Explosion Inside Jammu Airports: జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ లో పేలుళ్లు సంభవించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించినట్లు ఏఎన్‌ఐ తెలిపింది. టెక్నికల్ ఏరియాలో ఆదివారం తెల్లవారు జామున1.45 గంటల ప్రాంతంలో 5 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగాయని ఏఎన్ఐ తెలిపింది. ఇవి తక్కువ తీవ్రతతో సంభవించాయని, రెండు పేలుళ్లు జరిగినట్లు పేర్కొంది. అయితే, దీంట్లో ఒకటి ఖాళీ స్థలంలో సంభవించగా, మరొకటి భవనాల సమీపంలో జరిగిందని తెలిపింది.

ఈఘటనలో ఓ భవనం స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు సమాచారం. ఈ పేలుళ్లతో విమానశ్రయంలో వస్తువులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఈ కారణంగా సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఫోరెన్సిక్ బృందాలు పేలుళ్ల ప్రాంతాలకు చేరకుని దర్యాప్తు చేస్తున్నాయని వెల్లడించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఓ ఉగ్రవాదిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతని వద్ద నుంచి ఐదు కేజీల ఎల్ఈడీని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ మొత్తం అలర్ట్ అయింది.

ఈ పేలుళ్లలో రెండు డ్రోన్‌లు వాడినట్లు తెలుస్తోందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వైస్ ఎయిర్ చీఫ్, ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరాతో మాట్లాడి, అక్కడి పరిస్థితులపై ఆరా తీసినట్లు ఢిపెన్స్ కార్యాలయం పేర్కొంది. ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ జమ్మూలో పరిస్థితిని తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories