Chhattisgarh: బుల్డోజర్‌ టైర్‌పేలి.. ఇద్దరి మృతి

Two Die After JCB Tire Bursts in Chhattisgarh
x

Chhattisgarh: బుల్డోజర్‌ టైర్‌పేలి.. ఇద్దరి మృతి

Highlights

Chhattisgarh: టైరుకు గాలి నింపుతుండగా ప్రమాదం

Chhattisgarh: మెకానిక్‌ వర్క్‌షాపులో బుల్డోజర్‌ టైర్‌ పేలి ఇద్దరు మృతి చెందారు. చత్తీష్‌గడ్‌ రాష్ట్రం రాయపూర్‌లోని సిల్తారా పారిశ్రామిక వాడలో ఈ సంఘటన రెండ్రోజుల క్రితం జరిగింది. వర్క్‌షాప్‌లో ఓ వ్యక్తి బుల్డోజర్‌ టైరుకు గాలిని నింపుతుండగా మరో వ్యక్తి వచ్చి గాలి పరిమాణాన్ని రెండు మార్లు తనిఖీ చేశాడు. అదే సమయంలో టైరు ఉన్నట్టుండి పేలిపోయింది. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ పేలుడు ఘటన స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనలో మృతిచెందిన ఇద్దరు సోదరులని మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories