సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో పోటీ పడుతున్న రెండు రాజధానులు

Two Competing Capitals in the Software Industry
x

సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో పోటీ పడుతున్న రెండు రాజధానులు

Highlights

*ఐటీ హబ్ స్థాపనతో తిరిగిన హైదరాబాద్ దశ

Software Industry: దక్షిణాదిన బీజేపి, టీఆర్ ఎస్ మధ్య సరికొత్త రాజకీయం రాజుకుంది.అభివృద్ధిలో, వనరుల కల్పనలో, విశ్వనగర ప్రమాణాలను అందుకోడంలో మేమంటే మేం గొప్పని అటు కర్ణాటక సీఎం, ఇటు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేల్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ ఈ నగరాలలో వాల్డ్ క్లాస్ ప్రమాణాలు ఉన్నాయా?ఐటీ రంగంలో ఏ నగరం ప్రాధాన్యత ఎంత?

బెంగళూరు, హైదరాబాద్ నగరాలు ఐటీ హబ్స్ గా ఎదగడం ఒక్క రాత్రిలో జరిగినది కాదు.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రెండు నగరాలు ఇప్పుడు సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చుకున్నాయి. బెంగళూరు నగరం ఇంతలా అభివృద్ధి చెందడానికి ఆనగరానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రశాంతమైన చల్లని వాతావరణం, పేరెన్నికగన్న మల్టీనేషనల్ కంపెనీలు కొలువు తీరి ఉండటంతో అక్కడ ఐ టీ కంపెనీల స్థాపనకు దోహదపడింది. ఇంజనీరింగ్ కాలేజీలనుంచి స్కిల్డ్ స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో బయటకు రావడం అప్పుడే ఐటీ రంగం విస్తరించడం నగర రూపు రేఖలను మార్చేసింది. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు బెంగళూరు చరిత్రను మార్చేసాయి.1999-2004లో అప్పటి సీఎం ఎస్.ఎం. కృష్న సాఫ్ట్ వేర్ రంగం పురోగతికి బాటలు వేశారు. అదే టైమ్ లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ లో ఐటీరంగం పురోగతికి దోహదపడ్డారు.

ఐటీరంగానికి లేబర్ పాలసీలను సరళీకరించడంతో కంపెనీలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. మ్యాన్ పవర్ అందుబాటులో ఉండటంతో రేయింబగళ్లు ఐటీ కంపెనీలు పనిచేసేందుకు దోహదపడింది.విప్రో లాంటి సంస్థలు తమ వ్యాపారాన్ని సన్ ఫ్లవర్ ఆయిల్ నుంచి ఐటీ రంగంపై మళ్లించడానికి మౌలిక వనరులు అందుబాటులో ఉండటమే కారణం. అనుకూలమైన వాతావరణం, అందుబాటులో స్కిల్డ్ లేబర్ తో ప్రైవేట్ సెక్టర్ కంపెనీలకు బెంగళూరు స్వర్గ ధామంలా కనిపించింది.2021 కాలానికి బెంగళూరు 16 కొత్త యూనీకార్న్ కంపెనీలు పెట్టి చరిత్ర సృష్టించింది. ఓలాక్యాబ్స్, మిత్రా, ఫ్లిప్ కార్ట్, క్వికర్ లాంటి సంస్థలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరుపడ్డ నగరం ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుపడింది. బెంగళూరులో స్టార్టప్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. ఈ పరిణామాలతో బెంగళూరు నగరం ఊహించనంత ఎత్తుకు ఎదిగింది.

మరోవైపు హైదరాబాద్ నగరం చరిత్రపరంగానే కొంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. నిజామ్ పరిపాలనలో పెరల్ సిటీగా దీనికి పేరు.హైదరాబాద్ సంస్థానం స్థాయినుంచి తెలంగాణ రాజధానిగా ఎదిగిన క్రమంలో ప్రభుత్వాలు తీసుకున్న ప్రతీ నిర్ణయమూ భాగ్యనగర ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి. ఐటీ రంగం హైదరాబాద్ లో వేళ్లూనుకునేలా చేసేందుకు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాలు దోహదపడ్డాయి. బై బై బెంగళూరు, హెల్లో హైదరాబాద్ లాంటి స్లోగాన్లు కూడా ఐటీ రంగం భాగ్యనగరం వైపు చూసేందుకు దోహదపడ్డాయి. లార్సన్ అండ్ టుబ్రో లాంటి సంస్థల సహకారంతో సైబరాబాద్ నిర్మాణం సాధ్యపడింది. బిల్ గేట్స్ ను హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏర్పాటుకు ఆహ్వానించడం నగర ఐటీ చరిత్రలో మైలురాయి మై క్రోసాఫ్ట్ రాకతో ఐబీఎం, డెల్, డెలాయిట్, కంప్యూటర్ అసోసియేట్స్, ఒరాకిల్ లాంటి సంస్థలు కూడా హైదరాబాద్ లో బ్రాంచ్ లు ఏర్పాటు చేశాయి. నగరం ఈ విధంగా విస్తృతి చెందడమే గ్లోబల్ సిఈవోలు హైదరాబాద్ వైపు చూసేలా చేసింది.

చంద్రబాబు తర్వాత వైఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఐటీ రంగానికి ఇతోధికంగా ప్రోత్సాహకాలందించాయి. అందిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగం విస్తరణ కోసమే టీ హబ్ ను ఏర్పాటు చేసింది. దాదాపు 300 స్టార్టప్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. హైదరాబాద్ పోచారం క్యాంపస్ ఉద్యోగాల హబ్ గా మారిపోయింది. ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి సంస్థలు దాదాపు 25 మిలియన్ డాలర్లు ఖర్చుచేసి ఇక్కడ ఆఫీసులు నెలకొల్పాయి. ఇక ప్రపంచంలోకే అతిపెద్ద ఫర్నిచర్ రిటైలర్ ఐకియా కంపెనీ కూడా హైదరాబాద్ లోనే ఉంది. మొన్నటికి మొన్న విప్రోగ్రూప్ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో కలసి విప్రో కన్సూమర్ కేర్ ఆఫీస్ ఓపెన్ చేశారు కేటీఆర్. హైదరాబాద్ ఇప్పుడు లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఆశ్రయం కల్పిస్తోంది.గూగుల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీ, విప్రో, నోవార్టిస్, టాటా కన్సల్టన్సీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఐటీ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు మెరుగైన జీవన ప్రమాణాల విషయంలోనూ ర్యాకింగ్స్ లో బెస్ట్ సిటీగానే నిలుస్తోంది హైదరాబాద్.

ఇక రోడ్ల విషయానికొస్తే బెంగళూరు, హైదరాబాద్ రెంటిలోనూ రోడ్లు అధ్వాన్నంగానే ఉన్నాయి. వర్షాకాలంలో రెండుచోట్ల రోడ్లు దారుణంగా దెబ్బ తింటాయి. బెంగళూరు నగరం హైదరాబాద్ తో పోలిస్తే విస్తీర్ణంలో చిన్నది అందుకే తరచుగా ట్రాఫిక్ జామ్ లు పైగా కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ చాలా ఎక్కువ కానీ హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా చౌక అంతేకాదు నగరం నలుమూలలకు కనెక్టివిటీ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories