Twitter: ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్‌పై ఎఫ్ఐఆర్

Twitter India MD Manish Maheshwari named in FIR Over Incorrect Map Of India
x

Twitter: ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్‌పై ఎఫ్ఐఆర్

Highlights

Twitter: ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీష్ మహేశ్వరిపై ఉత్తరప్రదేశ్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

Twitter: ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై ఉత్తరప్రదేశ్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మహేశ్వరితో పాటు, న్యూస్ పార్టనర్‌షిప్స్ హెడ్ అమృత త్రిపాఠి పేరును కూడా ఇందులో చేర్చారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను ప్రత్యేక దేశాలుగా పేర్కొంటూ మ్యాప్‌ను తప్పుగా ట్విట్టర్ చూపించడంతో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఉద్దేశపూర్వకంగానే ఈ దేశద్రోహ చర్యకు పాల్పడ్డారని తన కంప్లయింట్‌లో బజరంగ్ దళ్ నేత ప్రవీణ్ భాటి పేర్కొన్నారు. ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడి జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు మహేశ్వరిపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ వారం ప్రారంభంలో మహేశ్వరికి కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఈలోగా మ్యాప్‌ విషయంలో ట్విట్టర్‌ చేసిన తప్పుడు పనితో ఇంకో కేసు నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories