TTD Chairman Inspects jammu Temple Works: జమ్మూ లో దివ్యక్షేత్రం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టిటిడి చైర్మన్.

TTD Chairman Inspects jammu Temple Works: జమ్మూలో టిటిడి నిర్మించ తలపెట్టిన దివ్యక్షేత్రం ( శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం) స్థలాన్ని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి బుధవారం పరిశీలించారు.

Bathula Yesu Babu
Published on: 26 Aug 2020 7:43 PM IST
TTD Chairman Inspects  jammu Temple Works:  జమ్మూ లో దివ్యక్షేత్రం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టిటిడి చైర్మన్.
X

జమ్మూ లో దివ్యక్షేత్రం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టిటిడి చైర్మన్.

TTD Chairman Inspects jammu Temple Works: జమ్మూలో టిటిడి నిర్మించ తలపెట్టిన దివ్యక్షేత్రం ( శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం) స్థలాన్ని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి బుధవారం పరిశీలించారు. అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది. దివ్యక్షేత్రం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీ వైవి సుబ్బారెడ్డి బుధవారం జమ్ముకు వెళ్లి ఆలయ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే టిటిడి ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలనిఆదేశిస్తామని చైర్మన్ అక్కడి అధికారులకు తెలిపారు.

జమ్మూ కలెక్టర్ శ్రీమతి సుష్మా చౌహాన్, జిల్లా అభివృద్ధిఆదనపు కమిషనర్ రమేష్ చందర్, అడిషనల్ డిప్యూటి కమిషనర్ శ్యాం సింగ్, అసిస్టెంట్ కమిషనర్ జనరల్ రాకేష్ దూబే, వైష్ణోదేవి ఆలయ బోర్డ్ సిఈఓ రమేష్ కుమార్, అదనపు సిఈఓ వివేక్ వర్మ చైర్మన్ వెంట ఉన్నారు.

Bathula Yesu Babu

Bathula Yesu Babu

Next Story