అందుకే ట్రంప్ ఓటమి పాలవుతున్నారు: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

Arun Chilukuri
Updated on: 6 Nov 2020 1:05 PM IST
అందుకే ట్రంప్ ఓటమి పాలవుతున్నారు: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
X

అమెరికా ఎన్నికల ఫలితాలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనానే ప్రచారాస్త్రంగా మారిందన్నారు. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ట్రంప్ ఓటమి పాలవుతున్నారని నడ్డా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత ప్రధాని మోదీ కరోనాపై విజయం సాధించారని జేపీ నడ్డా అన్నారు. ప్రత్యర్థి జో బైడెన్ కరోనా విషయంలో ట్రంప్‌పై విమర్శలు గుప్పించారని అన్నారు. ట్రంప్ ఓడిపోతే దానికి కారణం కరోనానే అని నడ్డా అంటున్నారు. బిహార్‌ మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగాలో నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా ప్రసంగించారు. దేశంలోని 130 కోట్ల జనాభా భద్రత మోదీ చేతిలో క్షేమంగా ఉందన్నారు. బీజేపీ-జేడీయూ విజయం బిహార్‌ అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story