ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నిరసనలు

TRS: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై నిరసనలకు మంత్రి కేటీఆర్ పిలుపు... బీజేపీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలన్న కేటీఆర్.

Sriveni Erugu
Published on: 9 Feb 2022 9:51 AM IST
TRS protests across the state today
X

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నిరసనలు

TRS: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎంతో పోరాడి తాము తెలంగాణ తెచ్చుకుంటే, రాష్ట్ర విభజన సరిగా జరగలేదంటూ మోదీ అనడం టీఆర్ఎస్ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో విషం చిమ్ముతూ అడ్డగోలుగా మాట్లాడారంటూ మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రంపై పోరుకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ పార్టీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని సూచించారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తెలిపారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రాణ త్యాగాలను పదేపదే కించపరుస్తున్న ప్రధాని వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రధాని పదవికే అవమానకరమన్నార మంత్రి కేటీఆర్‌.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story