Kerala: కేరళలోని కన్నూర్‌లో విషాద ఘటన

Kerala: కారులో మంటలు చెలరేగి గర్భిణీ సహా ఇద్దరు సజీవదహనం

Dhatripriya
Updated on: 2 Feb 2023 7:49 PM IST
Tragic Incident In Kannur Kerala
X

Kerala: కేరళలోని కన్నూర్‌లో విషాద ఘటన

Kerala: కేరళలోని కన్నూర్‌లో విషాద ఘటన జరిగింది. కారులో మంటలు చెలరేగడంతో గర్భిణి సహా ఇద్దరు ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను ప్రజిత్, అతని భార్య రీషాగా గుర్తించారు. ఈ విషాద ఘటన కన్నూర్ నగరంలోని జిల్లా ఆసుపత్రి సమీపంలో జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. కారు నడుపుతున్న గర్భిణి భర్త, గర్భిణి ముందు సీట్లలో, మరో నలుగురు వెనుక సీట్లలో ఉన్నారు. ప్రమాదం జరగగానే వెంటనే వెనక సీట్లలో ఉన్న నలుగురు కారులో నుంచి బయటపడ్డారు. కానీ కారు డోర్ జామ్ కావడంతో ముందు సీట్లో ఉన్న ఇద్దరు తప్పించుకోలేకపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆరుగురు సభ్యుల కుటుంబం ఆసుపత్రికి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. తొలుత డ్రైవింగ్ సీటులో ఉన్న ప్రజిత్ కాళ్లకు మంటలు అంటుకున్నాయి. అతను వెంటనే కారు ఆపి వెనుక తలుపులు తెరిచాడు. దీంతో వెనుక ఉన్న వ్యక్తులు కారు నుండి బయటకు పరుగెత్తుతుండగా, ప్రజిత్ ముందు తలుపు తెరవడంలో విఫలమయ్యాడు. కారులో ఇరుక్కుపోయిన దంపతులు మంటల్లో చిక్కుకున్నారు. ఆ జంట సహాయం కోసం కేకలు వేయడంతో ఏం చేయలేక స్థానికులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారని సమాచారం.

Dhatripriya

Dhatripriya

Next Story