ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సాహసం.. దూసుకొచ్చిన కారును ఆపేందుకు ప్రయత్నం.. కిలోమీటర్‌ వరకు ఈడ్చుకెళ్లిన కారు..

Maharashtra: మహారాష్ట్రలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు వింత అనుభవం ఎదురయ్యింది.

Arun Chilukuri
Published on: 14 Feb 2023 11:23 AM IST
Traffic Cop Dragged on car Bonnet for Over 1 km in Maharashtras Palghar
X

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సాహసం.. దూసుకొచ్చిన కారును ఆపేందుకు ప్రయత్నం.. కిలోమీటర్‌ వరకు ఈడ్చుకెళ్లిన కారు..

Maharashtra: మహారాష్ట్రలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు వింత అనుభవం ఎదురయ్యింది. పాలఘర్‌లోని వాసాయి ఏరియాలో స్పీడ్‌గా దూసుకొస్తున్న ఓ కారును ఆపేందుకు కానిస్టేబుల్‌ ప్రయత్నించాడు. అయినా కారు ఆపకుండా వెళ్లిపోయింది. రెప్పపాటులో కానిస్టేబుల్‌ కారు బానెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు.. అయినా డ్రైవర్‌ ఆపకుండా వెళ్లిపోయాడు. ఒక కిలోమీటర్ దూరం వరకు కానిస్టేబుల్‌ను ఈడ్చుకు వెళ్లాడు.. అయినా పట్టు వదలకుండా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న కానిస్టేబుల్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటె డ్రైవర్‌ కేవలం 19ఏళ్ల కుర్రాడు.. అతడికి ఎలాంటి డ్రైవింగ్‌ లైసెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నాడు.. మాణిక్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను కస్టడీకి పంపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story