రివర్ రాఫ్టింగ్ పోటీలో ఘర్షణ.. తెడ్లతో కొట్టుకున్న టూరిస్టులు

* ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఘటన

Dhatripriya
Published on: 21 May 2023 3:19 PM IST
Tourists Fight While River Rafting In Rishikesh Beat Each Other With Paddles
X

రివర్ రాఫ్టింగ్ పోటీలో ఘర్షణ.. తెడ్లతో కొట్టుకున్న టూరిస్టులు

River Rafting: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో నిర్వహించిన రివర్‌ రాఫ్టింగ్‌ పోటీలో ఘర్షణ చోటుచేసుకుంది. వేర్వేరు తెప్పల్లో ఉన్న రెండు బృందాలు పరస్పరం దాడులకు దిగాయి. గంగానది మధ్యలో తెడ్లతో కొట్టుకున్నారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ముగ్గురు వ్యక్తులు తెప్పపై నుంచి నదిలోకి దూకారు. శివపురి నుండి మునికిరేటి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే వైరల్ అయిన వీడియో పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story