Nambala Keshav Rao: ఎన్‌కౌంటర్ లో చనిపోయింది నంబాల కేశవరావే... కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన

Nambala Keshav Rao
x

Nambala Keshav Rao: ఎన్‌కౌంటర్ లో చనిపోయింది నంబాల కేశవరావే... కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన

Highlights

Nambala Keshav Rao: ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు మృతి చెందాడంటూ అమిత్‌ షా ట్వీట్ చేశారు.

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు మృతి చెందాడంటూ అమిత్‌ షా ట్వీట్ చేశారు. మావోలపై మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత చనిపోవడం ఇదే ప్రథమమన్నారు. ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టుల మృతి చెందారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌లో తెలియజేశారు.

నక్సలిజం నిర్మూలనలో కీలక విజయం: అమిత్ షా

నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం. ఈరోజు, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. సీపీఐ - మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు.

నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. మావోయిస్టులను హతమార్చిన మన ధైర్యవంతులైన భద్రతా దళాలు , ఏజెన్సీలను అభినందిస్తున్నాను. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్టు, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలియజేయడం సంతోషంగా ఉంది. మార్చి 31, 2026లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది అంటూ అమిత్‌ షా ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories