Jammu and Kashmir: కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత.. జైష్ ఎ మహ్మద్ టాప్ కమాండర్‌ హతం

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 13 Oct 2021 9:11 PM IST
Top JeM terrorist Commander killed in Jammu and Kashmir’s Pulwama
X

Jammu and Kashmir: కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత.. జైష్ ఎ మహ్మద్ టాప్ కమాండర్‌ హతం

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. దీనిలో భాగంగా భద్రతాదళాలు ఇవాళ భారీ విజయం సాధించాయి. అవంతిపొరా త్రాల్ ప్రాంతంలో తివారి మొహల్లా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్ ఎ మహ్మద్‌కు చెందిన టాప్ కమాండర్ షమ్ సోఫిని సంయుక్త బలగాలు హతమార్చాయి. ఇటీవల సరిహద్దు దాటి భారత్‌లోకి చోరబడడమే కాకుండా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని మారణకాండ సృష్టించడంతో టెర్రరిస్టుల ఏరివేత ప్రారంభించింది భారత సైన్యం. గత పదిరోజుల వ్యవధిలోనే మొత్తం పది మంది టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story