Top 6 News @ 6 PM: కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది...మనదే అధికారమన్న కేసీఆర్

Top 6 News @ 6 PM: కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది...మనదే అధికారమన్న కేసీఆర్
x
Highlights

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

1. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది, మనదే అధికారం: కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఆయన తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ వెనక్కి పోతోంది.. దాన్ని నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. పార్టీ ఆవిర్భవించిన రోజైన ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తామన్నారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పార్టీ ఫిరాయించిన 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోంది... కాంగ్రెస్ పార్టీ ఇక లేవదని ఆయన అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ను క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమిపై కొందరు పార్టీ నాయకులే తప్పుడు ప్రచారం చేశారని ఆయన అన్నారు. ఇలాంటి ప్రచారం మానుకోవాలని ఆయన సూచించారు.

2. మీరు ఎంత పన్ను వేస్తే మేం కూడా అంత వసూలు చేస్తాం: ట్రంప్

పన్నుల విషయంలో భారత్ సహా ఏ దేశానికి మినహాయింపు లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. గత వారంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. రెండు దేశాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. అయితే పన్నుల విధింపుపై మోదీ ఏదో తనకు చెప్పబోతే తాను అడ్డుకున్న విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. మీరు ఎంత ఛార్జి చేస్తే తాను కూడా అంతే చార్జి విధిస్తామని తాను మోదీకి చెప్పానని ట్రంప్ బుధవారం మీడియాకు చెప్పారు. ఈ విషయంలో మోదీ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తే తాను అడ్డుకున్నట్టు ఆయన తెలిపారు.

3. ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కు ఊరట

మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ముడా భూముల వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఊరట దక్కింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలు జరిగిన ఆరోపణలపై సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాల్లేవని లోకాయుక్త పోలీసులు తెలిపారు. సీఎంతో పాటు ఆయన సతీమణి పార్వతి తదితరులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు. ఈ ఆరోపణలతో సిద్దరామయ్యపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఆయనను రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. సామాజిక కార్యకర్త కృష్ణ పిటిషన్ పై విచారణ చేశారు.

4. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట దక్కింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ పై నమోదైన కేసులో తెలంగాణ హైకోర్టులో హరీశ్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీశ్ రావుతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ అధికారి రాధ కిషన్ రావుపైపోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేపట్టే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం స్టే విధించింది.

5. మిర్చి రైతులకు జగన్ పరామర్శ

గుంటూరు మిర్చి రైతులను బుధవారం జగన్ పరామర్శించారు. మిర్చి ధర పడిపోయిందని రైతులు జగన్ కు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు.తాము అధికారంలో ఉన్న సమయంలో రైతులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. జగన్ విమర్శలపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. జగన్ మతిభ్రమించి విమర్శలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు కౌంటరిచ్చారు. ఇదెలా ఉంటే ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం లేఖ రాశారు.

6. యూపీలో ఖైదీలకు గంగా జలం

ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో ఖైదీలకు కూడా గంగా జలం అందించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 55 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్న స్నానాలు చేారు. రాష్ట్రంలోని జైళ్లలోని 90 వేలకు పైగా ఖైదీలకు గంగా జలాలతో స్నానం చేసేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి21న ఆయా జైళ్లకు తీసుకెళ్తనున్నట్టు వారు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories