Top 6 News @ 6PM: సైఫ్ పై దాడి కేసు: పోలీసుల అదుపులో అనుమానితుడు, మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News @ 6PM: సైఫ్ పై దాడి కేసు: పోలీసుల అదుపులో అనుమానితుడు, మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

సైఫ్అలీఖాన్ పై దాడి కేసులో అనుమానితుడిని మధ్యప్రదేశ్‌లో ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

1. సైఫ్ పై దాడి కేసు: పోలీసుల అదుపులో అనుమానితుడు

సైఫ్అలీఖాన్ పై దాడి కేసులో అనుమానితుడిని మధ్యప్రదేశ్‌లో ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఈ నెల 16న సైఫ్ పై ఆయన ఇంట్లోనే దాడి జరిగింది. నిందితుడు అతనిపై కత్తితో దాడికి దిగారు. జనవరి 17న బాంద్రా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనతో అతనికి సంబంధంలేదని పోలీసులు తేల్చారు. శనివారం అదుపులోకి తీసుకొన్న నిందితుడిని పోలీసులు విచారించనున్నారు. దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.

2. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య: సంజయ్ రాయ్ దోషిగా తేల్చిన కోర్టు

ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య కేసులో సంజయ్ రాయ్ ను దోషిగా కోర్టు తేల్చింది. ఈ కేసులో దోషికి జనవరి 20న శిక్షను ఖరారు చేయనుంది. శనివారం కోల్ కతా కోర్టు తీర్పును వెల్లడించింది. 2024 ఆగస్టు 9న ఉదయం జూనియర్ డాక్టర్ సెమినార్ హల్ లో మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. నైట్ షిఫ్ట్ లో ఉన్న ఆమె హత్యకు గురైన ఘటన దేశ వ్యాప్తంగా డాక్టర్ల నిరసనకు దిగారు. సెమఆగస్టు10న సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెమినార్ హల్ లోకి నిందితుడు వెళ్లినట్టుగా అప్పట్లో పోలీసులు సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. సంఘటన జరిగిన ప్రదేశంలో దొరికిన ఫోన్ హెడ్ ఫోన్ కూడా సంజయ్ ఉపయోగించిందేనని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీని ఆధారంగా పోలీసులు ఆయనను అప్పట్లో అరెస్ట్ చేశారు. తొలుత ఈ హత్యకు తనకు సంబంధం లేదని సంజయ్ రాయ్ చెప్పారు.

3. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఇదే

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లున్నాయి. బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి 20న భారత్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో మార్చి 3న న్యూజిలాండ్ పోటీ పడుతుంది. పాకిస్తాన్ ఈ టోర్నీని నిర్వహిస్తోంది. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరుగుతాయి. చాంపియన్స్ ట్రోఫీకి భారత క్రికెట్ జట్టును బీసీసీఐ జనవరి 18న ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించనున్నారు.

భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కె.ఎల్. రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, షమి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హర్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, అర్హదీప్, జైస్వాల్, రిషబ్ పంత్, జడేజా.

4. సుచిర్ మరణం కలచివేసింది: ఓపెన్ఏఐ

సుచిర్ బాలాజీ మృతిపై ఓపెన్ ఏఐ స్పందించింది. ఆయన మరణం తమను ఎంతగానో కలచివేసిందని ఆ సంస్థ తెలిపింది. ఈ కేసులో అవసరమైన సహాయం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆ సంస్థ ప్రకటించింది. శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులను కూడా ఇదే విషయమై సంప్రదించిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ సంస్థ తెలిపింది. సుచిర్ బాలాజీ మరణంపై తల్లి పూర్ణిమారావు అనుమానం వ్యక్తం చేశారు.

5. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలి:బాబును కోరిన శ్రీనివాస్ రెడ్డి

నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కోరారు. కడప జిల్లా మైదుకూరులో ఎన్టీఆర్ వర్దంతిలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమయంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఐటీ రంగంలో లోకేష్ సేవలను ఆయన ప్రస్తావించారు. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే పార్టీకి కూడా ప్రయోజనంగా ఉంటుందని ఆయన అన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగా బాబుకు చేసిన వినతి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరతీసింది.

6. అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటన: బీహార్ మోస్ట్ వాంటెడ్ మనీష్‌‌గా గుర్తింపు

అఫ్జల్ ‌గంజ్ లో కాల్పులకు దిగింది బీహార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనీష్ అని పోలీసులు గుర్తించారు. బీదర్ ఏటీఎం క్యాష్ వాహనాన్ని దోచుకొని హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్ రాయ్ పూర్ వెళ్లేందుకు రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిద్దరి బ్యాగులను ట్రావెల్స్ యజమాని చెక్ చేస్తుండగా దుండగులు కాల్పులకు దిగి పారిపోయారు. ఈ కాల్పులకు దిగింది మనీష్ గా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories