టూల్‌కిట్‌ కేసులో దిశ రవికి బెయిల్‌

Arun Chilukuri
Updated on: 23 Feb 2021 9:16 PM IST
టూల్‌కిట్‌ కేసులో దిశ రవికి బెయిల్‌
X

టూల్‌కిట్‌ కేసులో దిశ రవికి బెయిల్‌

టూల్‌కిట్ కేసులో నిందితురాలు దిశ రవికి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు శాంతను ములుక్, నికిత జాకోబ్ ఇప్పటికే బెయిల్‌ పొందారు. దిశ రవికి బెయిలు మంజూరు చేయరాదని పోలీసులు కోరారు. ఆమెపై ఆరోపణల్లో పస లేదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసకు, టూల్‌కిట్‌కు సంబంధం ఉన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయా? అని జడ్జి ప్రశ్నించారు. పోలీసుల సమాధానంతో సంతృప్తి చెందని జడ్జి దిశ రవికి బెయిలు మంజూరు చేశారు. లక్ష రూపాయల విలువైన సొంత పూచీకత్తును, అంతే విలువగల రెండు ష్యూరిటీలను సమర్పించాలని దిశను ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story