logo
జాతీయం

దేశంలో టమాట ఫ్లూ కలకలం.. ఒడిశాలో 36 మంది చిన్నారులకు...

Tomato Flu Tension in India 36 Cases Breakout in Odisha | Tomato Flu Live Updates
X

దేశంలో టమాట ఫ్లూ కలకలం.. ఒడిశాలో 36 మంది చిన్నారులకు...

Highlights

Tomato Flu Live Updates: *19 ఏళ్ల లోపు పిల్లలపై ఈ ఫ్లూ ప్రభావం *ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

Tomato Flu Live Updates: ఒడిశాలో టమాట ఫ్లూ కలకలం రేపింది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్​గా పిలిచే ఈ వ్యాధి 26 మంది చిన్నారులకు సోకింది. సాధారణంగా దీన్ని టమాట ఫ్లూగా అధికారులు అనుమానిస్తున్నారు. పేగు సంబంధిత వైరస్ కారణంగా ఈ అంటు వ్యాధి సోకుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు మాత్రమే వ్యాపిస్తుందని చెబుతున్నారు. వయోజనులకు ఈ వైరస్​ను తట్టుకునే రోగ నిరోధక శక్తి ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపదంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి సోకిన చిన్నారులలో తీవ్రమైన జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ టమోట ఫ్లూ పై మొత్తం 36 మంది చిన్నారుల నమూనాలను పరీక్షించిన వైద్యులు.. దేశంలోని ఒడిశాలో 26 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్​లోని రీజినల్ మెడికల్​ రీసెర్చ్ సెంటర్​లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ఇక ఈ టమోట ఫ్లూ వ్యాధి బారినపడిన వారిలో 1-9 ఏళ్ల మధ్య వయసు పిల్లలే ఉన్నట్లు అధికారులు చెప్పారు. వారందరినీ 5-7 రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. అందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ అంటువ్యాధి ప్రాణాంతకం కాదని వివరించారు. ఈ నెల మొదట్లోనే కేరళలోని కొల్లం జిల్లాలోనూ 80 చిన్నారులు టమాట ఫ్లూ బారినపడ్డారు. దీంతో పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ వ్యాధి సోకకుండా చర్యలు చేపట్టారు.

Web TitleTomato Flu Tension in India 36 Cases Breakout in Odisha | Tomato Flu Live Updates
Next Story