Petrol Diesel Price Today: భగ్గుమంటోన్న పెట్రోల్ ధరలు

Petrol Diesel Price Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కి చేరువవుతున్నాయి.

Kranthi
Published on: 5 Jun 2021 8:44 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad o5 6 2021
X

Petrol Diesel Price Today:(File Image) 

Petrol Diesel Price Today: రోజుకు ప‌ది పైస‌లు, 20 పైస‌లు చొప్పున పెరుగుతూ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఏకంగా రూ. 100కు చేరువవుతున్నాయి. ఇక దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే లీట‌ర్ పెట్రోల్‌ ఇప్ప‌టికే సెంచ‌రీ కొట్టేసింది కూడా. ఇక శ‌నివారం కూడా ఇంధ‌న ధ‌ర‌ల‌కు బ్రేక్ ప‌డ‌లేదు.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 94.76 గా ఉండ‌గా, డీజిల్ రూ. 85.66 వ‌ద్ద కొన‌సాగుతోంది. ముంబ‌యిలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100.98 కాగా, లీట‌ర్ డీజిల్ రూ. 92.99 గా ఉంది. చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 96.23 గా ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ. 90.38 వ‌ద్ద కొన‌సాగుతోంది. బెంగ‌ళూరులో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 97.92 గా ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ. 90.81 వ‌ద్ద కొన‌సాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో …

హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 98.48 గా ఉండ‌గా డీజిల్ ధర రూ. 93.38 వ‌ద్ద కొనసాగుతోంది. క‌రీంన‌గ‌ర్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 98.63 గా ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ. 93.50 వ‌ద్ద కొన‌సాగుతోంది. విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ రూ. 100.89 వ‌ద్ద ఉండ‌గా.. డీజిల్ రూ. 95.19 గా ఉంది. విశాఖ‌లో లీట‌ర్ పెట్రోల్ రూ. 99.90 కాగా.. డీజిల్ రూ. 94.36 వ‌ద్ద కొన‌సాగుతోంది.

Kranthi

Kranthi

Next Story