NEET PG Exam: నేడు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా

NEET PG Exam: త్వరలో షెడ్యూల్‌ను ప్రకటించనున్న కేంద్రం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Jun 2024 10:30 AM IST
Today  NEET PG exam has been postponed
X

NEET PG Exam: నేడు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా

NEET PG Exam: నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో పాటు జాతీయ పరీక్షల సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌కు ఉద్వాసన పలికింది. నీట్‌ యూజీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యగా నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అతి త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది. వాయిదా వల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story