ఇవాళ రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపు సభ
Rahul Gandhi: దేశవ్యాప్తంగా 145 రోజులపాటు సాగిన భారత్ జోడోయాత్ర
ఇవాళ రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపు సభ
Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్ర ముగింపు సభ నేడు శ్రీనగర్‌లో జరగనుంది. జోడోయాత్ర దాదాపు 145 రోజుల పాటు సాగింది. అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ సాగిన ఈ యాత్రలో రాహుల్ గాంధీ 4 వేలకు పైగా కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. వారితో సమావేశాలు నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో గత ఏడాది ప్రారంభమయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శ్రీనగర్‌లో ముగియనుంది. ఇవాళ్టి ముగింపు సభకు 23 ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది.
Next Story




