నేడు కార్గిల్ విజయ్ దివస్ ... ఢిల్లీలోని వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులు

Kargil Vijay Diwas: అమరవీరులకు నివాళులర్పించిన రాజ్‌నాథ్‌సింగ్

Jyothi
Updated on: 26 July 2022 8:01 PM IST
Today is Kargil Vijay Diwas
X

నేడు కార్గిల్ విజయ్ దివస్ ... ఢిల్లీలోని వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులు

Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 1999లో పాకిస్థాన్‌లో జరిగిన కార్గిల్ వార్‌లో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్గిల్ వార్ హీరోలకు నివాళి అర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వీర జవాన్లకు అంజటి ఘటించారు.

విజయ్ దినోత్సవ సందర్భంగా త్రివిధ దళాధిపతులు అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. 23 ఏళ్ల క్రితం L.O.C. వద్ద పాకిస్థాన్ సైన్యం అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని భారత సైన్యం ఇదే రోజున తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది జులై 26న కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తారు.


Jyothi

Jyothi

Next Story