Delhi Mayor Election: నేడు ఢిల్లీ మేయర్‌ ఎన్నిక

Today Delhi Mayor Election
x

Delhi Mayor Election: నేడు ఢిల్లీ మేయర్‌ ఎన్నిక

Highlights

Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ పీఠంపై బీజేపీ దృష్టి

Delhi Mayor Election: ఇవాళ ఢిల్లీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభంకానుంది. 2022 డిసెంబర్ 7న ప్రకటించిన ఫలితాల్లో బీజేపీకి 104, ఆమ్‌ఆద్మీపార్టీకి 134, కాంగ్రెస్‌కు 9 సీట్లు, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఢిల్లీ మేయర్‌ ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమయింది. ఎన్నికలు జరపాలంటూ సీఎం కేజ్రీవాల్‌ చేసిన ప్రతిపాదనను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా ఆమోదించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మేయర్‌ ఎన్నిక జరగనుంది. అనంతరం డిప్యూటీ మేయర్‌, ఆరుగురు స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories