Trinamool MPs Protest: అమిత్ షా కార్యాలయం ముందు టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఢిల్లీలో ఉద్రిక్తత!

Trinamool MPs Protest: అమిత్ షా కార్యాలయం ముందు టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఢిల్లీలో ఉద్రిక్తత!
x
Highlights

Trinamool MPs Protest: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లుగా పరిస్థితులు మారాయి.

Trinamool MPs Protest: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లుగా పరిస్థితులు మారాయి. కోల్‌కతాలోని రాజకీయ వ్యూహకర్తల సంస్థ 'ఐ-ప్యాక్' కార్యాలయంలో ఈడీ జరిపిన సోదాలకు నిరసనగా టీఎంసీ ఎంపీలు ఢిల్లీలో ఆందోళనకు దిగారు.

నిరసనలో ప్రముఖ నేతలు:

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వెలుపల జరిగిన ఈ నిరసనలో ఎంపీలు మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్, కీర్తి ఆజాద్, డెరెక్ ఓబ్రియన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీని ఆయుధంగా వాడుతోందని వారు మండిపడ్డారు.

పోలీసుల జోక్యం - వాగ్వివాదం:

ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతుండగా, పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎంపీలను పోలీసులు లాక్కెళ్లడంపై టీఎంసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజాప్రతినిధులతో పోలీసులు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికమని డెరెక్ ఓబ్రియన్ మరియు మహువా మొయిత్రా విమర్శించారు.

అభిషేక్ బెనర్జీ ఘాటు స్పందన:

ఈ ఘటనపై టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ 'X' వేదికగా స్పందిస్తూ బీజేపీపై విరుచుకుపడ్డారు.

"బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య నిరసనలకు తావులేదు. దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుతూ ఎన్నికలను తారుమారు చేస్తున్నారు. రేపిస్టులకు బెయిల్ ఇచ్చి, నిరసనకారులను జైలుకు పంపడమే బీజేపీ విధానం. బెంగాల్ ప్రజలు దీనిని అంగీకరించరు. మిమ్మల్ని ఓడించేందుకు మా శాయశక్తులా కృషి చేస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

కోర్టు మెట్లెక్కిన ఈడీ - ఐప్యాక్:

మరోవైపు, సోదాల సమయంలో తమను అడ్డుకున్నారని ఈడీ ఆరోపిస్తుండగా.. అక్రమంగా సోదాలు చేస్తున్నారని ఐ-ప్యాక్ ప్రతినిధులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories