Bengal: ప్రధాని మోడీపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

Bengal: ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని టీఎంసీ ఆరోపించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Arun Chilukuri
Updated on: 30 March 2021 9:01 PM IST
TMC complaint Election Commission on Modis Bangladesh visit
X

Bengal: ప్రధాని మోడీపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

Bengal: ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని టీఎంసీ ఆరోపించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నెల 27న బంగ్లాదేశ్‌లో ఆయన పాల్గొన్న కార్యక్రమాలు బెంగాల్ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని ఆరోపించింది. విదేశీ గడ్డపై నుంచి మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారని తన ఫిర్యాదులో తెలిపింది తృణమూల్‌ కాంగ్రెస్‌. ప్రధాని హోదాలో మోడీ బంగ్లాదేశ్‌ వెళ్ళడం పట్ల తమకు అభ్యంతరం లేదని అక్కడి మతువా సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో సమావేశమయ్యారని పేర్కొన్నారు. అక్కడి ప్రాచీన దేవాలయంలో పూజలు నిర్వహించి ఓ మత పెద్దను కలుసుకోవడమే అభ్యంతరకరంగా ఉందని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story