Pulwama: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

Pulwama: దాదాపు 12గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్

Rama Rao
Published on: 12 Jun 2022 3:27 PM IST
Three Militants were killed in an Encounter in Pulwama Jammu and Kashmir
X

Pulwama: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

Pulwama: జమ్ముకశ్మీర్‌‌లోని పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ద్రాబ్‌గామ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్ దాదాపు 12 గంటల పాటు సాగింది. ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందినట్లు భద్రత దళాలు ప్రకటించాయి. జునైన్, ఫైజల్ నాజర్ భట్, ఇర్ఫాన్ అహ్ మాలిక్‌లుగా గుర్తించారు.

వీరంతా లష్షరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులని కశ్మీర్ ఐజీ తెలిపారు. జునైద్ అనే ఉగ్రవాది గతంలో కశ్మీరీ పోలీస్‌కు చెందిన రియాజ్ అహ్మద్‌ను హత్య చేశారని పేర్కొన్నారు. వీరు ముగ్గురు నుంచి రెండు ఏకే-47లు, ఒక పిస్తోల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story