Sukhdev Gogamedi: సుఖ్‌దేవ్ హత్య కేసులో ముగ్గురు కీలక నిందితుల అరెస్టు

Sukhdev Gogamedi: రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగా మేడీ దారుణ హత్య కేసులో ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు.

Shekhar G
Published on: 10 Dec 2023 5:53 PM IST
Three Key Accused Arrested In Sukhdev Murder Case
X

Sukhdev Gogamedi: సుఖ్‌దేవ్ హత్య కేసులో ముగ్గురు కీలక నిందితుల అరెస్టు

Sukhdev Gogamedi: రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగా మేడీ దారుణ హత్య కేసులో ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులతో పాటు వారి సహచరుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సుఖ్‌దేవ్‌ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ, రాజస్థాన్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలోనే రోహిత్‌ రాఠోడ్‌, నితిన్‌ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లను చండీగఢ్‌లో అరెస్టు చేశారు. వీరితో పాటు మరో వ్యక్తి ఉద్ధమ్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ముగ్గురు దుండగుల్లో ఒకడైన నవీన్‌ షెకావత్‌ సహచరుల కాల్పుల్లో మరణించాడు. సుఖ్‌దేవ్‌ హత్యకు తమదే బాధ్యత అంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు అనుబంధంగా పనిచేసే రోహిత్‌ గోదారా గ్యాంగ్‌ ప్రకటించుకుంది.

Shekhar G

Shekhar G

Next Story