జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Jammu And Kashmir: ఉగ్రవాదుల దాడుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం

Jyothi
Published on: 11 Aug 2022 9:16 AM IST
Three jawans Martyred in Terrorist Attacks
X

జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్‌‎లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీలోని సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దర్హల్ ప్రాంతంలోని పర్గల్​లోని సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. తెల్లవారుజామునే ఆర్మీ క్యాంప్​ ఫెన్సింగ్​ దాటుకుని లోపలకు చొరబడేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. టెర్రరిస్టులపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య చాలాసేపు హోరాహోరీ పోరు జరిగింది. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన ముష్కరుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు బలగాలు గుర్తించాయి. చుట్టుపక్కల ఉగ్రవాదులు నక్కి ఉండొచ్చని భావిస్తున్న భద్రతా సిబ్బంది విస్తృతంగా... సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని సైనిక అధికారులు వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story