అమెరికాలోని భారత టెక్కీల్లో ఆందోళన.. ఉద్యోగుల తొలగింపులో మనవారే అధికం..

Thousands of Indian Techies Struggle to Find New Jobs in US
x

అమెరికాలోని భారత టెక్కీల్లో ఆందోళన.. ఉద్యోగుల తొలగింపులో మనవారే అధికం..

Highlights

Indian Techies: ఆర్థిక మాంద్యం.. ఇది అమెరికన్‌ దిగ్గజ కంపెనీలను భయపెడుతున్నాయి.

Indian Techies: ఆర్థిక మాంద్యం.. ఇది అమెరికన్‌ దిగ్గజ కంపెనీలను భయపెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాది నవంబరు నుంచే మొదలైన తొలగింపుల ప్రక్రియ మరింత ఉధృతమవుతోంది. ఇప్పటివరకు వెయ్యికి పైగా టెక్‌ కంపెనీలు ఏకంగా 2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో ప్రధానంగా భారతీయ ఐటీ నిపుణులే బలవతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీలు చేపడుతున్న తొలగింపుల్లో భాగంగా.. 30 నుంచి 40 శాతం మంది భారతీయ నిపుణులే ఉద్యోగాలు కోల్పోయారు. వారంత హెచ్‌-1బీ, ఎల్‌- వీసాలతో అమెరికాలో ఉంటున్నారు. ఈ వీసాల నిబంధనల ప్రకారం.. 60 రోజుల్లో ఉద్యోగం వెతుక్కోవాలి.. లేదంటే అగ్రదేశాన్ని వీడాల్సి ఉంటుంది. అమెరికాలో ఉండాలంటే.. ఇప్పుడు వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పడం లేదు. గడువులోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం లేదా.. వీసా స్టేటస్‌ను మార్చుకునేందుకు భారతీయ టెక్కీలు అష్టకష్టాలు పడుతున్నారు.

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెజాన్‌, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా, ట్విట్టర్‌ వంటి పెద్ద టెక్‌ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గూగుల్‌ తాజాగా ప్రకటించింది. ఆల్ఫాబెట్‌, ప్రొడక్ట్‌ ఏరియాస్‌, ఫంక్షన్స్‌ తదితర విభాగాల్లో ఉద్యోగ కోతలు ఉంటాయి' అని పిచాయ్‌ తెలిపారు. ఉద్యోగులకు ఆయన క్షమాపణ చెప్పారు. ఐటీ సర్వీసుల దిగ్గజ సంస్థ విప్రో కూడా తాజాగా 450 మంది ఫ్రెషర్లపై వేటు వేసింది. ఈనెల ప్రారంభం నుంచి 20వ తేదీ వరకు ఇప్పటివరకు 173 కంపెనీలు 56 వేల మందిని తొలగించాయి. అంటే సగటున రోజుకు 2వేల 800 మంది ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారన్నమాట. 'ఐటీ ఉద్యోగం నుంచి తీసేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఉద్యోగాన్ని వదిలి సొంతంగా టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు సిద్ధం కావాలంటూ' రాహూల్‌ మహేశ్వరి అనే ఐటీ ఉద్యోగి సోషల్‌మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది.

అమెరికాలో టెక్‌ రంగంలో భారతీయ నిపుణుల తొలగింపు మన దేశంపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారత్‌తో సహా అంతర్జీతీయంగా అమెజాన్‌ 18వేల మందిని, గూగుల్‌ 12వేల మందిని, మెటా 11 వేల మందిని, మైక్రోసాఫ్ట్‌ 10 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించాయి. సామాజిక మాధ్యం షేర్ చాట్‌ 500 మందిని, స్విగ్గీ 380 మందిని, మెడి బడ్డీ 200 మందిని, ఓలా 200 వందిని డుంజో 80 మందిని, సాఫాఫ్‌ 450 మందిని అంతర్జాతీయంగా తొలగించనున్నాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్న మొన్నటివరకు తమ జీవితం బిందాస్‌ అని భావించిన టెక్కీల్లో ఇప్పుడు కలవరం మొదలయ్యింది. అసలే ఆర్థిక మాంద్యం నెలకొనడంతో టెక్‌ కంపెనీలు కొత్తగా ఎలాంటి నియామకాలను చేపట్టడం లేదు. దీంతో గత్యంతరంలేక తమ నైపుణ్యానికి సంబంధం లేని ఇతర ఉద్యోగాల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ.. అమెరికాలో ఉండడమా? లేక సొంత దేశానికి తరలి రావడమా? అనేది టెక్కీలు తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచకపోవడంతో.. టెక్కీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories