Thoothukudi Encounter: తూత్తుకుడిలో పోలీసులపై నాటుబాంబులతో దాడి

Thoothukudi Encounter: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలోని వళనాడు ప్రాంతంలో అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితులు దాడికి తెగ‌బడ్డారు

Karampoori Rajesh
Published on: 18 Aug 2020 8:19 PM IST
Thoothukudi Encounter: తూత్తుకుడిలో పోలీసులపై నాటుబాంబులతో దాడి
X

Thoothukudi Encounter: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలోని వళనాడు ప్రాంతంలో అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితులు దాడికి తెగ‌బడ్డారు. ఈ దాడి మ‌రింత తీవ్రం కావ‌డంతో పోలీసులు, రౌడీ గ్యాంగ్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్ర‌మంలో పోలీసులపై రౌడీ గ్యాంగ్‌ నాటు బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.

వివ‌రాల్లోకెళ్లే.. రెండేళ్ల క్రితం జరిగిన జంట హత్యల నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందం మణక్కరై ప్రాంతానికి వెళ్లింది. ఈ క్రమంలో రౌడీ షీటర్లు పోలీసులపై నాటుబాంబులు విసిరారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ సుబ్రమణ్యం, బాంబు విసిరిన రౌడీ షీటర్‌ దురై ముత్తు మృతిచెందగా, మరో కానిస్టేబుల్‌ గాయపడ్డారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరికొందరు పరారయ్యారు. నిందితుల వాహనంతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ జయకుమార్‌ పరిశీలించారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story