Kerala CM: కేర‌ళ సీఎంగా పిన‌ర‌యి విజ‌యన్ ప్ర‌మాణ‌స్వీకారం

Kerala CM: కేర‌ళ ముఖ్య‌మంత్రిగా పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

Arun Chilukuri
Updated on: 20 May 2021 5:28 PM IST
Thiruvananthapuram: Pinarayi Vijayan Takes Oath as The Chief Minister of Kerala
X

Thiruvananthapuram: కేర‌ళ సీఎంగా పిన‌ర‌యి విజ‌యన్ ప్ర‌మాణ‌స్వీకారం

Thiruvananthapuram: కేర‌ళ ముఖ్య‌మంత్రిగా పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్‌ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం కొవిడ్‌ నిబంధనల మధ్య కొనసాగింది. విజ‌య‌న్ సీఎంగా ప్ర‌మాణం చేయ‌డం వ‌రుస‌గా ఇది రెండోసారి.

విజ‌య‌న్ చేత గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ‌మ్మ‌ద్ ఖాన్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కే కేరళ ప్రజలు పట్టంకట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్విటర్‌లో స్పందించిన విజయన్‌.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నవ కేరళను నిర్మించేందుకు కలసి కట్టుగా కృషి చేద్దామని పిలుపినిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story