Twitter: సెలబ్రిటీలకు మస్క్ షాక్.. బ్లూటిక్ మాయం..!

These Celebrities Lost Verified Blue Ticks on Twitter
x

Twitter: సెలబ్రిటీలకు మస్క్ షాక్.. బ్లూటిక్ మాయం..!

Highlights

Twitter Blue Tick: ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ అన్నంత పని చేశాడు.

Twitter Blue Tick: ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ అన్నంత పని చేశాడు. ట్విట్టర్ లో బ్లూటిక్ బ్యాడ్జ్ కావాలంటే తప్పనిసరిగా సభ్యత్వం పొందాలని నిబంధన తెచ్చాడు. నెలవారీ ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే వెరిఫైడ్ బ్లూ మార్క్ కొనసాగుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని మన భారతీయులు అంతగా పట్టించుకోలేదు. ఎలాన్ మస్క్ కూడా ఈ ప్రతిపాదనను పలుమార్లు వాయిదా వేస్తూ రావడంతో మనవాళ్లు అంత సీరియస్ గా తీసుకోలేదు. కట్ చేస్తే తాజాగా వెరిఫైడ్ ఖాతాదారులకు షాక్ ఇస్తూ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించని వారి బ్లూ టిక్స్ ను ఎలాన్ మస్క్ తొలిగించేశాడు. దీంతో బ్లూ టిక్ కోల్పోయిన వారిలో పలువురు సినీ,రాజకీయ,క్రీడాప్రముఖులు ఉన్నారు.

బ్లూటిక్ కోల్పోయిన రాజకీయ నాయకుల జాబితాలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. క్రీడారంగం నుంచి సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సైనా నెహ్వాల్, సానియా మీర్జా ఇంకా పలువురు ప్రముఖులు ఉన్నారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సైతం వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోల్పోయారు.

ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి, మోహన్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, వెంకటేష్ , అక్కినేని నాగచైతన్య, అఖిల్, నితిన్, ప్రకాశ్ రాజ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచులక్ష్మీ, మనోజ్ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణు బ్లూ టిక్ లు అలాగే ఉన్నాయి. వీళ్లు బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నట్లు ఉన్నారు. ఇక బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా సైతం తమ బ్లూ టిక్ లను కోల్పోయారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్, శింబులకు సైతం బ్లూ టిక్ లేకుండా పోయింది.

మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ప్రముఖులు ట్విట్టర్ చర్యతో షాక్ అవుతున్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ యూజర్లకు షాకులు ఇస్తూనే ఉంది. పలు మీడియా సంస్థలకు సైతం బ్లూటిక్ ఎగిరిపోయింది. ఈ బ్లూ టిక్ సిస్టమ్ ను ట్విట్టర్ 2009లో ప్రవేశపెట్టింది. బ్లూటిక్ ఉంటే అది సెలబ్రిటీల ఒరిజినల్ అకౌంట్ అని లెక్క. ఫేక్ అకౌంట్లు క్రియేట్ అయినా బ్లూ టిక్ లేకపోతే ఆ అకౌంట్లు ఒరిజినల్ కావాని యూజర్లకు ఇట్టే అర్థమయ్యేది. ఇప్పుడు బ్లూ టిక్ లేకపోతే ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలిసే ఛాన్స్ లేదు..

ఇక బ్లూటిక్ సేవలు పొందాలంటే వెబ్ యూజర్లు నెలకు 8 డాలర్లు, ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో అయితే వెబ్ యూజర్లు 650 రూపాయలు, మొబైల్ యాప్ అయితే 900 చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories