Karnataka: కర్ణాటకలో ఎటూ తేలని సీఎం పంచాయితీ

There is Still Suspense over who will be the CM in Karnataka
x

Karnataka: కర్ణాటకలో ఎటూ తేలని సీఎం పంచాయితీ

Highlights

Karnataka: సీఎం పదవి కోసం పట్టుబడుతున్న సిద్ద, శివకుమార్‌

Karnataka: కర్ణాటకలో సీఎం ఎవరన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పదవి కోసం సిద్దరామయ్య, శివకుమార్‌‌లు పోటీ పడుతున్నారు. ఇద్దరూ కీలక నేతలే కావడంతో ఎటూ తేల్చలేక కాంగ్రెస్ హైకమాండ్ ఇరకాటంలో పడింది. సీఎం పదవిని రెండున్నరేళ్లు పంచుకోవడానికి డీకే ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. తననే సీఎంను చేయాలంటూ హైకమాండ్‌కు డీకే సంకేతాలు ఇచ్చారు. తన బలం 135 మంది ఎమ్మెల్యేలు అంటూ డీకే శివకుమార్ నిన్న కామెంట్స్‌ చేశారు. అధిష్టానం పిలుపుతో నిన్నే ఢిల్లీకి సిద్దరామయ్య చేరారు. నిన్న హైకమాండ్ మీద అలకతో ఢిల్లీకి వెళ్లని శివకుమార్ మరికాసేపట్లో హస్తిన బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో ఢిల్లీకి పయనం కానున్నారు.తన అభిప్రాయాలను హైకమాండ్‌తో చర్చించనున్నారు శివకుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories