Kejriwal: నేడు కేజ్రీవాల్ పిటిషన్‌పై వెలువడనున్న తీర్పు

Kejriwal: తనను ఈడీ అరెస్ట్‌ చేయడాన్ని సవాల్ చేసిన కేజ్రీవాల్‌

Jyothi
Published on: 9 April 2024 11:03 AM IST
The Verdict on Kejriwal Petition Today
X

Kejriwal: నేడు కేజ్రీవాల్ పిటిషన్‌పై వెలువడనున్న తీర్పు

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనుంది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్‌ అక్రమం అంటూ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. వంద కోట్ల రూపాయల అవినీతిపై ఆధారాలు ఉన్నాయంటూ ఈడీ వాదనలు వినిపించగా.. ఎన్నికల వేళ తన పార్టీకి నష్టం కలిగించేందుకే అరెస్ట్ చేయించారంటూ కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించారు.

ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కుతుందా? రిమాండ్‌లోనే ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

Jyothi

Jyothi

Next Story