Jai Shankar: పాకిస్థాన్‌తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసింది
Jai Shankar: పాక్ ఉగ్ర చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయి
Jai Shankar: పాకిస్థాన్‌తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసింది
Jai Shankar: పాకిస్థాన్‌తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. పాక్ ఎలా వ్యవహరిస్తే.. భారత్ కూడా అందుకు తగినవిధంగా బదులిస్తుందని వ్యాఖ్యానించారు. పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుందని తెలిపారు. పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
పాక్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలేయలేమని జైశంకర్ స్పష్టంచేశారు. ఇటీవల జమ్మూలో తరచూ జరుగుతున్న ఉగ్రదాడులతో ఇరుదేశాల మధ్య సంబంధం అస్థిరంగా ఉందని పేర్కొన్నారు.
Next Story




