Rajya Sabha: రాజ్యసభలో ముగిసిన 72 మంది ఎంపీల పదవీ కాలం...

Rajya Sabha: రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం...

Shireesha
Updated on: 31 March 2022 12:54 PM IST
The tenure of 72 MPs in the Rajya Sabha has ended | Narendra Modi | Live News
X

Rajya Sabha: రాజ్యసభలో ముగిసిన 72 మంది ఎంపీల పదవీ కాలం...

Rajya Sabha: రాజ్యసభలో నేటితో 72మంది ఎంపీల పదవీ కాలం ముగిసింది. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఎంపీలకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పార్టీలకు అతీతంగా పలకరించుకున్నారు. సభను వీడుతున్న సభ్యులతో సహచరులు గత స్మృతులను నెమరు వేసుకున్నారు. వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోడీ సభ్యులకు అభినందనలు తెలిపారు..

ఎంపీల వీడ్కోలు సమావేశంతో రాజ్యసభ ఆవరణ అంతా సందడిగా మారింది. పదవీ కాలం ముగుస్తున్న వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సురేష్ ప్రభు, డిఎస్, కెప్టెన్ లక్మీకాంతరావు ఉన్నారు.

Shireesha

Shireesha

Next Story