నేటి నుంచి కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్

* జనవరి 16న తొలిడోసు తీసుకున్న వారికి వ్యాక్సిన్ * ఫస్ట్ డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ * దుష్ప్రభావం చూపిన వారికి సెకండ్ డోస్ ఉండదు- అధికారులు

Sandeep Eggoju
Updated on: 13 Feb 2021 12:10 PM IST
The second dose of the Covid vaccine starts today
X

Representational Image

దేశవ్యాప్తంగా ఇవాళ కొవిడ్ టీకా రెండో డోసు ప్రారంభం కానుంది. జనవరి 16న తొలి డోసు ఇవ్వగా., ఇవాళ్టి నుంచి రెండో డోసు ఇవ్వనున్నారు. తొలిడోసు తీసుకున్న వైద్య సిబ్బంది, ఆరోగ్య శాఖ కార్యకర్తలందరికీ అదే కేంద్రాల్లో రెండో డోసు ఇస్తారని అధికారులు వెల్లడించారు. అయితే జనవరి 16 నుంచి వివిధ రోజుల్లో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకునేలా తేదీలు ప్రకటించారు. అయితే తొలి డోసులో దుష్ప్రభావం చూపిన వారికి సెకండ్ డోస్ ఇవ్వబోమని స్పష్టం చేశారు వైద్యారోగ్య శాఖ అధికారులు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story