బార్లు తెరుచుకోవడానికి అనుమతులు

బార్లు తెరుచుకోవడానికి అనుమతులు
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా బార్‌లను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో చాలా రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలను తెరిచాయి.

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా బార్‌ లను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో చాలా రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలను తెరిచాయి. అయితే రాజస్థాన్ లో మాత్రం జూన్‌ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమైనప్పటికీ బార్లు మాత్రం తెరుచుకోలేదు. అయితే తాజాగా ఈ విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బార్లు తిరిగి తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది.

ప్రభుత్వ అనుమతుల నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్‌లు తెరుచుకున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల దాకా కర్ఫ్యూ ఉండటంతో రాత్రి వేళ బార్ లు మూసివేయాల్సి ఉంది. ఇక మందుబాబులు సామాజిక దూరం పాటిచండం, శానిటైజేర్ తప్పక వాడటం తోపాటు ముఖానికి మాస్కు తప్పనిసరి చేస్తూ బార్లకు అనుమతులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories