Gajuwaka: సామాజిక దూరం పాటించేలా చూడండి

S. Srikanth
Updated on: 29 March 2020 9:40 AM IST
Gajuwaka: సామాజిక దూరం పాటించేలా చూడండి
X

గాజువాక: కరోనా వైరస్ ప్రబలకుండా సామాజిక దూరం పాటించేలా చూడాలని ఎమ్మెల్యే రమణ మూర్తిరాజు కోరారు. విశాఖ జిల్లా అచ్చుతాపురం బజార్ ను ఆయన సందర్శించారు. రైతులు కొనుగోలుదారులు మీటర్ దూరం పాటించడంతో పాటు ముఖానికి మాస్క్ లు వేసుకోవాలని కోరారు.

స్థలం సరిపడకపోతే మరో ప్రాంతానికి బజార్ ను తరలించాలని ఎన్ఏ లక్ష్మణరావుకు సూచించారు. అనంతరం యలమంచిలిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ స్థానిక నాయకులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story