Indian Railways: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో రైల్వేలో 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ..!

Indian Railways: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో రైల్వేలో 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ..!

Arun Chilukuri
Updated on: 16 Feb 2022 8:01 PM IST
Indian Railways: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో రైల్వేలో 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ..!
X

Indian Railways: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో రైల్వేలో 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ..!

Indian Railways: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో రైల్వేలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మొత్తం 2,65,547 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిల్లో2,177 గెజిటెడ్‌ పోస్టులుకాగా, 2,63,370 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఆ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకొని ఉద్యోగాలు సాధించాలి. అయితే ఎక్కడెక్కడ ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకుందాం.

గెజిటెడ్‌ పోస్టులు 2,177

సెంట్రల్‌ రైల్వేలో 56, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో 87, ఈస్టర్న్‌ రైల్వేలో 195, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 170, మెట్రో రైల్వేలో 22, నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 141, నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 62, నార్త్‌ ఈస్ట్‌ ఫ్రంటీర్‌ రైల్వేలో 112, నార్తెర్న్‌ రైల్వేలో 115, నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 100, సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో 43, సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 88, సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 137, సౌతర్న్‌ రైల్వేలో 65, వెస్ట్‌ సెంట్రల్ రైల్వేలో 59, వెస్ట్రన్‌ రైల్వేలో 172, ఇతర రైల్వే విభాగాల్లో 507 గెజిటెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

2,63,370 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు

సెంట్రల్‌ రైల్వేలో 27,177, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో8,447, ఈస్టర్న్‌ రైల్వేలో28,204, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 15,268, మెట్రో రైల్వేలో 856, నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 9,366, నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 14,231, నార్త్‌ ఈస్ట్‌ ఫ్రంటీర్‌ రైల్వేలో 15,477, నార్తెర్న్‌ రైల్వేలో 37,436, నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 15,049, సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో 16,741, సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 9,422, సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 16,847, సౌత్‌ ఇండియన్‌ రైల్వేలో 9,500, సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 6,525, వెస్ట్‌ సెంట్రల్ రైల్వేలో 11,073, వెస్ట్రన్‌ రైల్వేలో 26,227, ఇతర విభాగాల్లో 11,073 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story