Employees: త్వరలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు, పెన్షన్ పెరిగే అవకాశాలు..!

Employees: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందనుంది. దేశంలో పనిచేసే వ్యక్తులకు వయోపరిమితిని పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ ఒక సూచనను జారీ చేసింది.

Arun Chilukuri
Updated on: 23 May 2022 2:00 PM IST
The PMs Economic Advisory Committee has Suggested Raising the Retirement Age and Pension of Government Employees
X

Employees: త్వరలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు, పెన్షన్ పెరిగే అవకాశాలు..! 

Employees: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందనుంది. దేశంలో పనిచేసే వ్యక్తులకు వయోపరిమితిని పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ ఒక సూచనను జారీ చేసింది. దీంతో పాటు దేశంలో రిటైర్మెంట్‌ వయస్సును పెంచడంతో పాటు యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్‌ను కూడా ప్రారంభించాలని ప్రధాని ఆర్థిక సలహా కమిటీ తెలిపింది. ఇందుకోసం కమిటీ తన ప్రతిపాదనను తయారుచేసింది. నివేదిక ప్రకారం ప్రతి నెల ఉద్యోగులకు కనీసం 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. దేశంలోని సీనియర్ సిటిజన్ల భద్రత కోసం మెరుగైన ఏర్పాట్లను ఆర్థిక సలహా కమిటీ సిఫార్సు చేస్తోంది.

ఈ నివేదిక ప్రకారం పని చేసే వయస్సు జనాభా పెరగాలంటే రిటైర్మెంట్‌ వయస్సును పెంచాల్సిన అవసరం ఉంది. సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఇలా చేయవచ్చు. 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల నైపుణ్యాభివృద్ధి గురించి ఈ నివేదికలో చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్ జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో అసంఘటిత రంగంలో నివసిస్తున్నవారు, మారుమూల ప్రాంతాలు, శరణార్థులు, శిక్షణ పొందే స్తోమత లేని వలసదారులని కూడా ఇందులో చేర్చాలని సూచించారు. అయితే వారికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు.

వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ 2019 ప్రకారం.. 2050 నాటికి భారతదేశంలో దాదాపు 32 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉంటారని గమనించాలి. అంటే దేశ జనాభాలో దాదాపు 19.5 శాతం మంది రిటైర్డ్ కేటగిరీలోకి వెళ్తారు. 2019 సంవత్సరంలో భారతదేశ జనాభాలో 10 శాతం లేదా 140 మిలియన్ల మంది సీనియర్ సిటిజన్ల కేటగిరీలో ఉన్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story