Himachal Pradesh: కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి

* రాళ్ల ధాటికి లోయలో కూలిపోయిన వంతెన * వాహనాలు, పర్యాటకుల విశ్రాంతి గదులు ధ్వంసం * కిన్నౌర్ జిల్లా సంగాల్ వద్ద ఘటన

Sandeep Reddy
Updated on: 25 July 2021 5:30 PM IST
The Landslide Broke And Killed 9 People in Himachal Pradesh
X

హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి ప్రమాదం 

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో విషాదం నెలకొన్నది. కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయలో కొండ చరియలు విరిగిపడి తొమ్మిది మంది పర్యాటకులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారు. భూకంపం సంభవించినట్లుగా ఒక్కసారిగా కొండపై నుంచి బండరాళ్లు వేగంగా కిందకు దూసుకు వచ్చాయి. రాళ్ల ధాటికి లోయలో ఉన్న వంతెన కూలిపోయింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పర్యాటకుల విశ్రాంతి గదులు దెబ్బతిన్నాయి. ప్రమాద ఘటనతో అంతా చెల్లాచెదురయ్యారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story