The Great Khali: బీజేపీలోకి చేరిన రెజ్లింగ్‌ స్టార్‌ ఖలి

The Great Khali: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వం

Rama Rao
Updated on: 10 Feb 2022 4:30 PM IST
The Great Khali  Joined The BJP Party
X

 బీజేపీలోకి చేరిన రెజ్లింగ్‌ స్టార్‌ ఖలి

The Great Khali: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నడుం బిగించింది. అందులో భాగంగా ప్రముఖులను పార్టీలో చేర్చుకుంటోంది. తాజాగా రెజ్లింగ్ స్టార్‌ ది గ్రేట్‌ ఖలి అలియాస్‌ దలిప్‌ సింగ్‌ రానా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తాను పేరు ప్రఖ్యాతులు, డబ్బు కోసం బీజేపీలో చేరలేదని ఖలి తెలిపారు. అమెరికాలో ఉంటున్న తాను దేశంలో ప్రధాని చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితుడినై ఇక్కడికి వచ్చినట్టు ఖలి తెలిపారు. తాను కూడా అభివృద్ధిలో భాగమవ్వాలనే బీజేపీలో చేరినట్టు రెజ్లింగ్ స్టార్‌ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story