ఈ ప్రభుత్వ పథకం అమలు చేస్తే కరెంట్‌ బిల్లు జీరో.. ఇంకా సబ్సిడీ ప్రయోజనం..!

The Government has Extended the Duration of the Rooftop Programme Check for all Details
x

ఈ ప్రభుత్వ పథకం అమలు చేస్తే కరెంట్‌ బిల్లు జీరో.. ఇంకా సబ్సిడీ ప్రయోజనం..!

Highlights

Rooftop Program Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రూఫ్‌టాప్ పథకం గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు.

Rooftop Program Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రూఫ్‌టాప్ పథకం గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం 'రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్' వ్యవధిని మార్చి 31, 2026 వరకు పొడిగించింది. అంతేకాదు పైకప్పులపై సోలార్ ప్యానెల్‌లను అమర్చడానికి ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించవద్దని వినియోగదారులను కోరింది.

మీరు కరెంటు బిల్లును తగ్గించుకోవాలనుకుంటే మోడీ ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ స్కీమ్‌కి అప్లై చేయడం వల్ల మీ ఇంటి కరెంటు బిల్లు జీరో అయిపోతుంది. మీకు భారీ సబ్సిడీ లభిస్తుంది. రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను మార్చి 2026 వరకు పొడిగించినందున అప్పటి వరకు సబ్సిడీ అందుబాటులో ఉంటుందని న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేషనల్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఏ కంపెనీకి డబ్బులు చెల్లించవద్దని, అలాగే మీటర్, టెస్టింగ్ కోసం సంబంధిత పంపిణీ సంస్థ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించవద్దని వినియోగదారులందరిని కోరింది.

ఏదైనా విక్రేత, ఏజెన్సీ లేదా వ్యక్తి అదనపు రుసుము కోరినప్పుడు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవాలనుకునే వినియోగదారులు నేషనల్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం కింద దేశం మొత్తానికి మూడు కిలోవాట్ల కెపాసిటీకి కిలోవాట్‌కు రూ. 14,588 సబ్సిడీ లభిస్తుంది. ఈ మూడు కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌తో మీరు మీ ఇంట్లో ఏసీ, ఫ్రీజ్, కూలర్, టీవీ, మోటార్, ఫ్యాన్ మొదలైనవాటిని నడపవచ్చు. దీనివల్ల కరెంట్‌ బిల్లు ప్రతి నెలా సున్నాకి వస్తుంది. మీ మిగులు విద్యుత్‌ను అద్దెదారులకు లేదా పొరుగువారికి విక్రయించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories