Assam Floods: అస్సాంలో కొనసాగుతున్న వరద బీభత్సం

Assam floods: అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 July 2024 8:30 PM IST
The Flood Situation in Assam is Critical
X

Assam Floods: అస్సాంలో కొనసాగుతున్న వరద బీభత్సం

Assam floods: అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కుండపోతతో గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో తుపాను ప్రభావంతో 52 మంది మృతిచెందారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదలకు అస్సాం రాష్ట్రం అస్తవ్యస్థమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story