ఇండియాలో అత్యంత చల్లటి ప్రదేశాలు ఏంటో తెలుసా.. చలికాలం ఇక్కడికి వెళ్లాలంటే..!

The Coldest Places in India Think Before Going Here
x

ఇండియాలో అత్యంత చల్లటి ప్రదేశాలు ఏంటో తెలుసా.. చలికాలం ఇక్కడికి వెళ్లాలంటే..!

Highlights

Coldest Places: కొంతమందికి అత్యంత చల్లటి ప్రదేశాలలో పర్యటించాలని కోరిక ఉంటుంది. అందుకోసం స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ మొదలైన దేశాలకు వెళుతారు.

Coldest Places: కొంతమందికి అత్యంత చల్లటి ప్రదేశాలలో పర్యటించాలని కోరిక ఉంటుంది. అందుకోసం స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ మొదలైన దేశాలకు వెళుతారు. కానీ ఇండియాలో కూడా అత్యంత చల్లటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. చలికాలంలో ఇక్కడికి వెళ్లాలంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ చలికాలం మాత్రమే కాదు ఏ కాలంలోనైనా వాతావరణం చల్లగానే ఉంటుంది. అలాంటి కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1. జమ్మూ కశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో ద్రాస్ ఒక చిన్న పట్టణం. ఈ ప్రదేశం నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రత -45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ చలిని భరించడం అందరికి సాధ్యం కాదు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఇక్కడ బతకలేరు.

2. కార్గిల్ అంటే అందరికి పాకిస్తాన్తో జరిగిన యుద్దమే గుర్తుకువస్తుంది. కానీ ఇక్కడ సహజ సిద్దమైన అందాలు పర్యటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఇది సురు నదికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో ఏకంగా మంచు కురుస్తుంది. చలి తీవ్రత అధికంగా ఉంటుంది.

3. ఉత్తర సిక్కిం చలికి ప్రసిద్ధి. ఇక్కడ లాచెన్, తంగు వ్యాలీ చాలా ప్రత్యేక నగరాలు. చాలా మంది ప్రజలు వేసవి సెలవుల కోసం ఇక్కడికి వస్తారు. అయితే కొంతమంది ధైర్యవంతులు శీతాకాలాలను ఆస్వాదించడానికి ఇక్కడ పర్యటిస్తారు. ఇక్కడ చలిని తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు.

4. స్పితి ఒక నగరం మాత్రమే కాదు ఇది మొత్తం లోయ. ఇక్కడ చలి భరించడం చాలా కష్టమైన పని. ఇది టిబెట్, భారతదేశం మధ్య ఉంటుంది. దాదాపు ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తారు. ఇక్కడ నిజమైన అందాన్ని చూడాలనుకుంటే శీతాకాలంలో మాత్రమే వెళ్లాలి.

5. లడఖ్ రాజధాని లేహ్ చలి, అందమైన ప్రదేశాలకు ప్రసిద్ది చెందింది. ఇక్కడ ఎల్లప్పుడూ చలికాలం ఉంటుంది కానీ శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రత -20 డిగ్రీల నుంచి -15 డిగ్రీల సెల్సియస్ పడిపోతుంది. కానీ ఇప్పటివరకు కనిష్ట ఉష్ణోగ్రత -28.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక్కడికి వెళ్లడం అంటే ఒక్కసారి ఆలోచించాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories