విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు కేంద్రం భారీ యాక్షన్ ప్లాన్!

విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు కేంద్రం భారీ యాక్షన్ ప్లాన్!
x
Highlights

ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు కేంద్ర హోం శాఖ నడుం బిగించింది. విమానాలు, యుద్ధనౌకల ద్వారా వారిని...

ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు కేంద్ర హోం శాఖ నడుం బిగించింది. విమానాలు, యుద్ధనౌకల ద్వారా వారిని వెనక్కు తీసుకు వచ్చేందుకు మెగా యాక్షన్ ప్లాన్ రచించింది. అలాగే అత్యవసరంగా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారికి కూడా ఈ సందర్భంగా అవకాశం కల్పించింది. గల్ఫ్ యుద్ధం తర్వాత అంత భారీ స్థాయిలో భారతీయుల తరలింపు అసలు ఎలా సాగుతోంది? లెటజ్ వాచ్ దిస్ స్టోరీ.

ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర హోం శాఖ మెగాయాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది కరోనా నేపధ్యంలో ఆయా దేశాల్లో ఉండలేక స్వదేశానికి రావాలని అనేక మంది ఆందోళన పడుతున్నందున కేంద్రం ఈ మెగా తరలింపు ప్రక్రియను చేపడుతోంది. దాదాపు 12 దేశాలనుంచి భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. వీరికోసం ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకూ విమాన సర్వీసులు నడుపుతారు దాదాపు 64 విమానాల ద్వారా వివిధ దేశాలనుంచి భారతీయులు స్వదేశానికి తరలిరానున్నారు. మొత్తం లక్షా 90 వేలమంది స్వదేశానికి వచ్చే వారిలో ఉన్నారు. అయితే వీరందరికీ ఇక్కడికొచ్చాక క్వారంటైన్ తప్పనిసరి వీరికోసం నౌకలు, విమానాలను సిద్ధం చేశారు.

పశ్చిమాసియా, మాల్దీవ్ లలో ఉన్నవారిని తీసుకు రాడానికి ప్రత్యేక నౌకలను రంగంలోకి దించుతున్నారు. మొదటి గల్ఫ్ యుద్ధం తర్వాత భారత దేశం చేపడుతున్న అతిపెద్ద మెగాతరలింపు ప్రక్రియ ఇదే గల్ఫ్ యుద్ధం సమయంలో లక్షా 70 వేల మందిని తరలించారు. అమెరికా, ఫిలిప్పీన్స్, సింగపూర్, బంగ్లాదేశ్, యూఏఈ, యూకే, సౌదీ అరేబియా, కతార్, సింగపూర్, ఒమన్, బహ్రెయిన్, కువైట్ ల నుంచి భారతీయులు స్వదేశానికి రానున్నారు. విమానాల్లో భౌతిక దూరం పాటిస్తూ వీరంతా ప్రయాణిస్తారు ఒక్కో విమానానికి 300 మందిని మాత్రమే అనుమతిస్తారు, విమానం ఎక్కేముందు వారంతా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. కేవలం ఎసింప్టోమాటిక్ ప్రయాణీకులను మాత్రమే జర్నీకి అనుమతిస్తారు. ఇక విమాన ప్రయాణం టిక్కెట్ ధరలను భారీగా పెంచారు. చికాగో-ఢిల్లీ మధ్య విమాన టిక్కెట్ ధర లక్ష రూపాయలుగా నిర్ణయించారు. లండన్ నుంచి ముంబైకి టిక్కెట్ 50 వేలు కాగా, ఢాకా- ఢిల్లీ మధ్య విమానం టిక్కెట్ ధర 12 వేలుగా నిర్ణయించారు.

ఇక నౌకల ద్వారా తరలించడానికి ఐఎన్ ఎస్ శార్దూల్, ఐఎన్ ఎస్ మగర్ , ఐఎన్ ఎస్ జలాశ్వ నౌకలను సిద్ధంగా ఉంచారు. జలాశ్వ నౌక విశాఖ పట్నం నుంచి బయల్దేరి అరేబియా సముద్రం గుండా ప్రయాణిస్తుంది. గర్భిణీలు, వృద్ధులు, ఆరోగ్య పరమైన అవసరాలు ఉన్నవారిని, టూరిస్టులను,కుటుంబంలో అనారోగ్య పీడితులను చూసేందుకు వెళ్లే వారికీ ముందు ప్రాధాన్యత ఇస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories